NewsWaves.news

ల‌వ‌ర్స్ డే రివ్యూ

వింక్ గాళ్ ప్రియా వారియ‌ర్ తొలి సినిమా ల‌వ‌ర్స్ డే మూవీపై ఆమె అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. తొలి సినిమా విడుద‌ల కాక‌ముందే వ‌రుస ఆఫ‌ర్లు, జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చుకుంది ప్రియా వారియ‌ర్‌. ఇలా ఎన్నో అంచ‌నాల‌ మ‌ధ్య ఈరోజు విడుద‌లైన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ చ‌దివి తెలుసుకోండి.

  • తార‌గ‌ణం: రోషన్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, నూరీన్‌ షరీఫ్‌ తదితరులు
  • మ్యాజిక్‌ : షాన్‌ రెహమాన్‌
  • డైర‌క్ష‌న్‌ : ఒమర్‌ లులు
  • నిర్మాత : ఎ.గురురాజ్, సి.హెచ్‌. వినోద్‌ రెడ్డి.

స్కూల్ వ‌య‌సులో ఉండే అమ్మాయి, అబ్బాయిల మ‌ధ్య ఉండే అన్ని ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉంటాయి. ప్రేమా, జోకులు వంటివి అన్న‌మాట‌. రోష‌న్‌, హ‌ధ మ‌ధ్య మొద‌లైన స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే ప్రేమ‌ను తెలియ‌జేద్దాం అనుకునే స‌మ‌యంలోనే అనుకోని ఒక సంఘ‌ట‌న జ‌రుగుతుంది. ఈ సంఘ‌ట‌న ప్ర‌భావం వారి జీవితంపై ఎలా ఉండ‌నుంది.. వారు ఒక్క‌ట‌వుతారా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌

ల‌వ‌ర్స్ డే మూవీ గురించి గ‌త కొంత కాలంగా ఏ వార్త వ‌చ్చినా అది హైలైట్ అవుతోంది. అందుకే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఈ మూవీలో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ లీడ్ రోల్‌లో క‌నిపించ‌డం లేదు. ఈ మూవీలో నూరీన్ పాత్ర‌కు ప్రాధాన్య‌త ఎక్కువ‌గా ఉంటుంది. అయితే రోష‌న్ తో పోల్చితే ప్రియా న‌ట‌న‌కు త‌క్కువ మార్కులే ప‌డ‌తాయి. సినిమా సాంకేతికంగా రిచ్‌గా ఉంది. ఎడిటింగ్‌,నేప‌థ్య సంగీతం, పాట‌లు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ద‌ర్శ‌కుడు లులు సినిమా ఎండింగ్ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది.

రేటింగ్ 2./5

Related Articles