NewsWaves.news

సంబరాల కోసం ప్రత్యేకమైన స్వీట్లతో సిద్ధమైన కమలం పార్టీ…

దేశ వ్యాప్తంగా ఎన్నికలు అయిపోయిన విషయం తెలిసింది.ఇక ఫలితాలకు మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం నాడు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మళ్లీ అధికార పగ్గాల్ని బీజేపీయే చేపట్టనుందని స్పష్టం చేశాయి.దీంతో గెలుపు తమదేనని కమలం పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అంతే కాదు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాగూ విజయం తమదేనని వెల్లడవుతుంది కనుక ఆ తర్వాత సంబరాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకొని దానికి కావాల్సిన అన్ని ప్లాన్స్ కూడా రెడీ చేసేసుకుంది బిజెపి.

సాధారణంగా ఎన్నికలలో ఫలితాలు విజయం వైపుగా వెలువడుతున్నపుడు ఆయా పార్టీల కార్యకర్తలు ఆనందంగా స్వీట్లు పంచుకుంటూ, సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ సంబరాలలో పంచుకునేందుకు బీజేపీ ఖరీదైన స్వీట్లను ఆర్డర్ ఇచ్చింది.ఈ స్వీట్లు ఢిల్లీ చాంద్నీ చౌక్ ప్రాంతానికి చెందిన ఓ స్వీట్ దుకాణంలో ప్రత్యేకంగా తయారు చేయిస్తుంది. స్వీట్లు కూడా ఆ పార్టీ గుర్తు అయిన కమలం ఆకారంలో ఉండేలా తయారు చేపిస్తున్నారు. బాదం, పిస్తాలను వేసి తయారు చేస్తున్న ఈ స్వీట్ల ఖరీదు కిలో 2 వేల రూపాయలు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి