NewsWaves.news

బీభత్సం సృష్టించిన లారీ..

నగరంలో ఒక లారీ బీభత్సం సృష్టించింది.హైదరాబాద్‌లో గల ఖాజాగూడ చౌరస్తాలో ఒక లారీ ఇటుక లోడుతో వెళుతూ స్కూలు బస్సు పైకి దూసుకువెళ్లింది.ఆ లారీ అతివేగంగా ప్రయాణించడం వల్లే బస్సు పైకి వెళ్లినట్టు సమాచారం. అయితే ఆ సమయంలో స్కూల్‌ బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులను తీసుకొచ్చేందుకు శంకర్మట్ డీడీ కాలనీ నుంచి ఆ స్కూల్ బస్సు వెళుతోంది.ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. అయితే ఆ సదరు లారీకి బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయని,అందువల్లే ఈ ప్రమాదం సంభవించింది అని కూడా తెలుస్తోంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి