NewsWaves.news

భ‌ద్రాద్రి రామ‌య్య‌కు ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వం

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన భద్రాద్రిలో శ్రీ‌రామచంద్ర‌స్వామి పట్టాభిషేక మహోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జ‌రిగింది. నిన్న సీతారామ క‌ళ్యాణం క‌న్నుల‌పండువ‌గా జ‌రుగ‌గా నేడు స్వామివారి ప‌ట్టాభిషేకం జ‌రిగింది. ఈ ఉత్స‌వం తిల‌కించ‌డానికి పెద్ద సంఖ్య‌లో భక్తులు త‌ర‌లివ‌చ్చారు.

రామ‌నామ స్మ‌ర‌ణ‌తో భ‌ద్రాత్రి క్షేత్రం మార్మోగుతోంది. ప‌ట్టాభిషేకం సంద‌ర్భంగా శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తికి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. అంతకు ముందు భద్రాద్రి రామయ్యను గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు దర్శించుకున్నారు. ప్రధానాలయంలో అర్చకులు పూజలు నిర్వహించారు. స్వామివారి ద‌ర్శ‌నానికి త‌ర‌లివ‌చ్చిన భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి