NewsWaves.news

ఆ వీడియోలు అసలైనవి అవునో కాదో…లోకేష్

చంద్రగిరిలో రీపోలింగ్ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్‌.నేడు విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన…ఎన్నికలు ముగిసి దాదాపు 40 రోజులు అయ్యిందని,ఇప్పుడు రీపోలింగ్‌ నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. తాము రీపోలింగ్‌ నిర్వహించాలని కోరిన సమయాల్లో మాత్రం ఎలక్షన్ కమిషన్ స్పందించలేదని ఆరోపించారు.

ఇక మోడీ కమిషన్ ఆఫ్ ఇండియాలా ఎలక్షన్ కమిషన్ వ్యవహార తీరు ఉందని లోకేష్ మండిపడ్డారు.చంద్రగిరిలోని కొన్ని కేంద్రాల్లో అక్రమాలు జరిగాయని, వాటికి సంబంధించిన వీడియోలు కూడా సాక్ష్యాలుగా తమ వద్ద ఉన్నాయని ఈసీ వెల్లడిస్తోంది కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా… ఈసీ విడుదల చేస్తామంటున్న వీడియోలు అసలైనవో కాదో చూడాల్సిన అవసరం ఉంది అంటూ లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి