NewsWaves.news

నక్కలకి ప్రసాదం పెట్టే ఆలయం ఎక్క‌డుందో తెలుసా?


ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు అక్కడ ప్రసాదం పెట్టడం.. మనం కళ్లకు అద్దుకుని తినడం మామూలే. మనం ప్రసాదం అని వాడుకలో వాడే పదానికి అన్నం, నైవేద్యం అనే అర్థాలు ఉన్నాయి. కానీ ప్రసాదం అంటే మనసును నిర్మలం చేసేది అని అర్థం. దానాల్లోకి అన్నదానం మహా గొప్పదని చెబుతారు. అందుకే ప్రసాదాన్ని ఆలయాల్లో పంచుతారు. భక్తికి భక్తి, శక్తికి శక్తి, త్రికరణ శుద్ధి కలిగించే ప్రసాదాన్నిమనం ఎన్నడూ విస్మరించకూడదు. మనసును కాస్త ప్రశాంతత కలిగించే అవకాశాన్నివదులుకోకూడదు. ప్రసాదం తయారీ కార్యక్రమం ఎంతో పవిత్రంగా సాగుతుంది. అందుకే ప్రసాదంగా తయారు చేసిన ఆహారం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది.

మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌సాదం విలువ ఏమిటో తెలుసుకున్నాం క‌దండి. మ‌రి అంత ప‌విత్ర‌మైన ప్ర‌సాదం కోసం ఆల‌యానికి వెల్తే మ‌నం ఎంత ప‌రిత‌పిస్తాం. అలాంటి ఆ ప్ర‌సాదాన్నిన‌క్క‌లు వేస్తే ? ఏంటి న‌క్క‌ల‌కు ప్ర‌సాద‌మా అనుకుంటున్నారా? అవును ఇప్ప‌డు నేను చెప్పే ఆల‌యం గురించి మీరు చ‌దివితే న‌మ్మాల్సిందే. ఇక్క‌డ న‌క్క‌ల‌కు ప్ర‌సాదం పెట్ట‌డం ఆన‌వ‌తీ. ఇదేం విడ్డూరం అనుకుంటున్నారా? అయితే ఆ ఆల‌యం గురించి మీకు చెప్పాల్సిందే.

గుజరాత్ లోని కచ్ అనే జిల్లా ఉంది. ఇది మన దేశంలోనే అతిపెద్ద జిల్లా. ఈ జిల్లా ముఖ్యకేంద్రానికి ఓ 90 కిలోమీటర్ల దూరంలో కాలో దుంగార్ అనే పర్వతం ఉంది. ఈ పర్వతం నల్లటి నలుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని చెబుతారు. పదిహేను వందల అడుగుల ఎత్తులో కాలో దుంగార్ ఉంటుంది. కాబట్టి ఈ పర్వతాన్నిఎక్కిచూస్తే దూరదూరంగా ఉన్న ప్రదేశాలన్నీకనిపిస్తాయి. ఆఖరికి పాకిస్తాన్ భూభాగం కూడా కనిపిస్తుంది. అందుకని పర్యటకులు ఈ కొండని ఎక్కేందుకు ఉత్సాహపడుతూ ఉంటారు కూడా. అయితే వారి ఉత్సాహానికి మరో కారణం కూడా ఉంది! అదే కాలో దుంగార్ మీద ఉన్న దత్తాత్రేయుని ఆలయం.

కాలోదుంగాల్ మీద ద‌త్తాత్రేయుని ఆల‌యం క‌థ ఏమిటో చూద్దాంః కాలో దుంగార్ మీద ఉన్న ఆలయం చిన్నదే! కాని దాని వెనుక ఉన్న చరిత్ర మాత్రం అనూహ్యమైన‌ది. త్రిమూర్తుల అవతారమైన దత్తాత్రేయులవారు ఒకానొక సందర్భంలో ఈ పర్వతాలు మధ్యన సంచరించే వార‌ట‌. ఆ సమయంలో ఆయన దగ్గర ఆహారాన్నిఆశించి కొన్ని నక్కలు దగ్గరకు వచ్చాయి. కానీ ఆ నక్కల ఆహారాన్నితీర్చేందుకు దత్తాత్రేయులవారి దగ్గర ఎలాంటి ఆహారమూ లేదట. దాంతో తన చేతినే వాటి ముందు ఉంచారట స్వామివారు. ‘లే అంగ్’ (నా శరీరభాగాన్నితీసుకో) అంటూ తన చేతినే వాటికి అర్పించారట.
మరొక కథ కూడా ప్రాచుర్యంలో వుందిః

kala dungar india

ఒకానొక రాజు, దత్తాత్రేయుని దర్శనం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. ఆ రాజు తపస్సుని పరీక్షించేందుకు దత్తాత్రేయులవారు ఒక నక్క రూపంలో రాజు దగ్గరకు చేరుకుని తన ఆకలి తీర్చమని అడిగారట. దాంతో ఆ రాజు రుచికరమైన భోజనాన్ని ఆ జీవి ముందు ఉంచాడు. ‘ఇదేనా నీ దానగుణం. మాంసాహారాన్ని ఇష్టపడే నా ముందు ఇలాంటి ఆహారం ఉంచుతావా!’ అంటూ ప్రశ్నించిందట ఆ నక్క. దాంతో రాజు స్వయంగా తన చేతిని నరికి మారురూపంలోని దత్తాత్రేయుల ముందు ఉంచాడట. రాజు దానగుణానికి దత్తాత్రేయులవారు ఎంతో ప్రసన్నులై ఆయనకు తన నిజరూపంలో సాక్షాత్కరించారని చెబుతారు.

కథ ఏదైతేనేం, ఈ ప్రాంతంలో నక్కల ఆకలిని తీర్చిన ఘటన ఇక్క‌డ జ‌రిగింది, కాబ‌ట్టి ఆ ఘటన ఆధారంగా గత 400 సంవత్సరాలుగా నక్కలకు ప్రసాదాన్నిఅందించే ఆచారమూ సాగుతోంది. రోజూ మధ్యాహ్నమూ, సాయంత్రమూ ఇక్కడి దత్తాత్రేయ ఆలయంలో ఉన్న పూజారి ఒక అరుగు దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ఓ పళ్లెం మీద కొడుతూ ‘లే అంగ్, లే అంగ్’ అని అరుస్తాడు. పూజారి మాట కోసమే ఎదురుచూస్తున్నాయా అన్నట్లుగా… కొద్ది నిమిషాల్లోనే నక్కలు బిలబిలలాడుతూ అక్క‌డ‌కు వచ్చేస్తాయి. అరుగు మీద పూజారి ఉంచిన ప్రసాదాన్ని ఆవురావురుమంటూ తింటాయి. చాలా సందర్భాలలో బెల్లంతో చేసిన పరమాన్నాన్నే ప్రసాదంగా పెడుతూ ఉంటారు.

Related Articles