NewsWaves.news

రంజాన్ మాసంలో అయినా ప్రశాంతంగా ఉండనివ్వండి… మహబూబా ముఫ్తి

కనీసం రంజాన్ మాసం లో అయిన ప్రశాంతంగా ఉండనివ్వండి ఇ అంటూ వ్యాఖ్యానించారు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ. ఉగ్రదాడులను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యంత పవిత్రమైన రంజాన్ నెలలో ఉగ్రవాదులు ఎవ్వరు కూడా ఎటువంటి దాడులకు పాల్పడ్డ వద్దు అని ఆమె కోరారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా గాలింపు చర్యలని రంజాన్ మాసంలో నిలిపి వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వలన కనీసం ఆ నెల రోజులైనా కాశ్మీర్ లో ఉన్న ప్రజలు ప్రశాంతంగా నివసిస్తారని, అలా ఒక్క నెల రోజులైనా ప్రజలు ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం ఇవ్వాలని అటు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు ఉగ్రవాద సంస్థల అని ఆమె కోరారు. అంతేకాకుండా రంజాన్ మాసంలో కేంద్రం కాల్పుల విరమణను కూడా ప్రకటించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి