NewsWaves.news

మరి కొద్ది గంటల్లో ప్రచారానికి తెర

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నెల నుంచి ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగాయి. అయితే ఈ జోరు ఈ రోజుతో ముగియనుంది. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు తమ ప్రచారాన్ని నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ నియమావళిలో ఉంది.

సాధారణంగా అయితే సాయంత్రం 6 గంటలకు పోలింగ్ గడువు.. అయితే ఇటీవలే మరో గంట అదనంగా చేర్చారు. అంటే సాయంత్రం ఆరు వరకు పోలింగ్ సాగుతుంది. దానికి 48 గంటల ముందు అంటే ఈరోజు 6 వరకు ప్రచారం చేయొచ్చు. తర్వాత కూడా ప్రచారం చేయడం నేరం అవుతుంది. మొత్తం మీద నేటితో ప్రచారం ముగుస్తుండగా, వ్యక్తిగతంగా తమతమ సన్నిహితులు, బంధువులు, పరిచయస్తులను కలిసి, రహస్యంగా ప్రచారం చేసుకోవడం తప్ప అభ్యర్థులకు మరో మార్గం ఉండదు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి