NewsWaves.news

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ ప్రీ రిలీజ్ రివ్యూ

రామ్ గోపాల్ వ‌ర్మ రేపు బాంబు పేల్చ‌నున్నాడు. అంటే నిజ‌మైన బాంబు కాదు. కానీ దాని తీవ్ర‌త మాత్రం బాంబులాగే ఉండ‌నుంది. ద‌శాబ్దాలుగా ఎవ్వ‌రూ ట‌చ్ చేయ‌ని చంద్ర‌బాబు-ఎన్టీఆర్ -వెన్నుపోటు యాంగిల్‌ను క‌వ‌ర్ చేస్తూ.. ల‌క్ష్మీస్ ఎన్టిఆర్ సినిమాను వ‌ర్మ తెర‌కెక్కిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ట్రైల‌ర్ రేపు ఉద‌యం 9.27 నిమిషాల‌కు విడుద‌ల కానుంది.

అయితే సినీ వర్గాల్లో ఈ మూవీకి సంబంధించి సీరియ‌స్ అండ్ సిల్లీ డిస్క‌ష‌న్స్ న‌డుస్తున్నాయి. ఒక డిస్క‌ష‌న్ ప్ర‌కారం ఈ ట్రైలర్‌లో వర్మ సినీ & పొలిటిక‌ల్‌ ఇండ‌స్ట్రీకి చెందిన ఎంతో మందిని కవర్ చేయ‌నున్నాడ‌ట‌. వాళ్ల మెడ‌న ఈ ట్రైల‌ర్ చుట్టేయ‌నున్నాడ‌ట‌. ఇందులో ఎవ‌రూ ఊహించ‌ని డైలాగ్స్ వినిపిస్తాయ‌ని.. ఎవ‌రూ అనుకోని మ‌నుషులు క‌నిపిస్తార‌ని.. ఊహ‌కంద‌ని వ‌ర్షెన్స్ బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని అంటున్నారు.

నంద‌మూరి కుటుంబం మొత్తం ఈ ట్రైల‌ర్లో క‌నిపించ‌నుంద‌ట‌. హ‌రికృష్ణ‌, బాల‌కృష్ణ‌, పురంధేశ్వ‌రితో పాటు ఎన్టీఆర్ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు తోడున్న ల‌క్ష్మీ పార్వ‌తి కూడా ఇందులో కీల‌కంగా క‌నిపించ‌నుంద‌ట‌. ఆఫ్ కోర్స్‌.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కాబ‌ట్టి ల‌క్ష్మీ పార్వ‌తి ఉండ‌టం కామ‌న్‌. అయితే ఫిలింన‌గ‌ర్ కామెంట్స్ ప్ర‌తీసారి నిజం అవ్వ‌వు. కానీ ప్ర‌తీసారి అబ‌ద్ధం కూడా అవ్వ‌వు. మరి నిజం ఏంటో… రేపు పొద్దున చూద్దాం.

రేపు ఉద‌యం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ రివ్యూ మీకోసం అందిస్తాం.. స్టేట్యూన్డ్‌

Lakshmi’s NTR trailer review

Related Articles