NewsWaves.news

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ రివ్యూ: చ‌ంద్ర‌బాబే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పాడా ఏంటి ?

వివాదల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ చెప్పిన విధంగానే ఈ రోజు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశాడు. నిన్న ఆంజ‌నేయ స్వామికి ఆకుపూజ చేయాల‌ని చెప్పిన వ‌ర్మ‌… ట్రైల‌ర్‌లో మాత్రం అంత స్ట‌ఫ్ చూపించ‌లేదు. నిజానికి ట్రైల‌ర్‌ను చూసిన త‌ర్వాత క‌లిగిన మొద‌టి ఫీలింగ్‌..కొంచెం మంచి ఎన్టీఆర్ మిన‌హా మిగితా న‌టీన‌టుల‌ను సెట్ అవ‌లేదు అని. అయితే ట్రైల‌ర్ బాగాలేదు అని చెప్ప‌డం లేదు. బాగుంది..కానీ ఊహించిన‌ట్టుగా… బాంబు పేల్చే విధంగా లేదు.

రివ్యూ.

1.ఎన్టీఆర్ పాత్ర స‌రిగ్గా సెట్ అయింది. కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌లో న‌టించిన‌ ముత్తు ల‌క్ష్మీ క్యారెక్ట‌ర్ యాక్ట్ర‌స్ య‌జ్ఞా శెట్టి ను ల‌క్ష్మీ పార్వ‌తిగా చూపించాడు వ‌ర్మ‌. న‌ట‌న విష‌యంలో సినిమాలో ల‌క్ష్మీ పార్వ‌తికి మార్కులు వేయోచ్చేమో కానీ.. లుక్ వైస్ సెట్ అవ‌లేదు.

2.చంద్రబాబు పాత్ర‌కు వంగ‌వీటి సినిమాలో న‌టించి శ్రీ తేజ్ న్యాయం చేశాడు అనిపిస్తోంది. ఇక్క‌డ చెప్పుకోవాల్సిన విష‌యం చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌కు డబ్బింగ్‌. ట్రైల‌ర్‌లో ఒక్క డైలాగే ఉన్నా.. అచ్చంగా చంద్ర‌బాబు నాయుడే స్వ‌యంగా డబ్బింగ్ చెప్పిన‌ట్టు అనిపించ‌డం ఖాయం.

3.త‌ర్వాత మోహ‌న్‌బాబు క్యారెక్ట‌ర్ ఎంట‌ర్ అవుతుంది. హ్యాట్సాఫ్ చాలా గొప్ప‌గా చెప్పారు అంటూ ల‌క్ష్మీ పార్వ‌తిని మెచ్చ‌కుంటాడు మోహ‌న్ బాబు.అయిత‌నే సినిమాలో మోహ‌న్ బాబు పాత్ర కీలం అవుతుందని తెలుస్తోంది.

4.మ‌రోవైపు ఎన్టీఆర్ వారసుల క్యారెక్ట‌ర్స్ పోషించిన న‌టీన‌టులు అంత‌గా సెట్ అవ్వ‌లేదు. ఈ వ‌య‌సులో ఆడ‌తోడు అవ‌స‌రమా అని ఒక డైలాగ్ ఉంటుంది…అది బాల‌కృష్ణ చెప్పాడా..లేదా హ‌రికృష్ణ అని తేల్చుకోవ‌డానికి స‌మ‌యం ప‌ట్టింది.

5.పాత్ర‌ల ఎంపిక విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఎలిమెంట్స్‌తో వెన్నుపోటు అంశాన్ని తెర‌కెక్కించే ఆలోచ‌న చేసినందుకు ముందు వ‌ర్మ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇక న‌టీన‌టులు ఎలా ఉన్నా.. కంటెంట్ కోసం సినిమా చూసేయాల్సిందే. మ‌రి మూవీ ఎప్పుడు విడుద‌ల చేస్తాడో చూడాల్సిందే.

ట్రైల‌ర్ చూడండి.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్ రివ్యూ

Related Articles