NewsWaves.news

ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్ష్మణరావు విజయం

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కె.ఎస్.లక్ష్మణరావు ఘనవిజయం సాధించారు. కృష్ణ-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్ష్మణరావు 80,670 ఓట్లు సాధించారు.

మొత్తం 1,49,319 ఓట్లు పోలవగా ఆయన సమీప ప్రత్యర్థి నూతలపాటి అంజయ్యకు కేవలం 12550 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 68,120 ఓట్ల భారీ మెజారిటీతో లక్ష్మణరావు విజయం సాధించారు. తన విజయంపై స్పందించిన లక్ష్మణరావు.. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు. లక్ష్మణ్ రావు గతంలో రెండుసార్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా పనిచేశారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి