NewsWaves.news

బాల‌య్య‌కు అంత ధైర్యం లేదు : ల‌క్ష్మీ పార్వతి

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన “ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు” మూవీ ఈ రోజు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ గురించి ఇటీవ‌లే ల‌క్ష్మీ పార్వ‌తి సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. మ‌హానాయకుడులో చంద్ర‌బాబును గొప్ప‌గా చూపింబోతున్నార‌ని తెలుసుకున్న ల‌క్ష్మీ పార్వ‌తి.. వాళ్లు అంత‌కు మించి ఇంకేం చేయ‌లేరు అన్నారు.
చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా బాల‌కృష్ణ సినిమా తీయ‌లేడనీ.. బాబుకు బాల‌య్య వియ్యంకుడు అవ‌డం వ‌ల్ల‌.. వైస్రాయ్ ఒప్పందాల గురించి బ‌య‌టికి చెప్ప‌లేడు అన్నారు. మ‌హానాయకుడులో త‌న పాత్ర ఉండ‌బోద‌ని.. అది ఉంటే వాళ్ల బండారం మొత్తం బ‌య‌ట‌ప‌డిపోతుంద‌న్నారు ల‌క్ష్మీ పార్వ‌తి.

Related Articles