NewsWaves.news

పవన్ పక్కాగా అసెంబ్లీకి వెళ్తాడు అంటున్న లగడపాటి…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా రంగప్రవేశం ఖాయం అని తేల్చి చెప్పారు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్. నేడు అమరావతిలో లగడపాటి మీడియా సమావేశం నిర్వహించారు. పవన్ ఖచ్చితంగా శాసనసభలోకి అడుగు పెట్టబోతున్నారని ఈ సందర్భంగా లగడపాటి వెల్లడించారు. కానీ జనసేన పార్టీ ఈ ఎన్నికలలో ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

కాకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ గెలిచిన సీట్ల కన్నా తక్కువగానే రావచ్చు అనే అభిప్రాయాన్ని లగడపాటి వ్యక్తం చేశారు. అంతే కాదు కేంద్రంపై రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లగడపాటి. ఇక తాను చెప్పినవన్నీ కేవలం ఒక రాజకీయ నేతగా వేసిన అంచనాలే అని,రేపు తిరుపతిలో మొత్తం ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తాను అని లగడపాటి తెలిపారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి