NewsWaves.news

చిల్లర కష్టాలు….

ఒక కార్ల షో రూమ్ కి వచ్చిన లేడీ కస్టమర్ చేసిన పనికి ఆ కారు షోరూం సిబ్బంది షాక్ కు గురయ్యారు.కారు కొనడానికి వచ్చిన ఆమె ప్లాస్టిక్ సంచుల్లో చిల్లర తీసుకుని వచ్చింది. ఆమె తెచ్చిన చిల్లరను లెక్కపెట్టడానికి ఆ షాప్ లో ఉన్న 17 మంది సిబ్బందికి అక్షరాల మూడు రోజులు పట్టింది. ఈ సంఘటన చైనా లో జరిగింది. చైనాలోని కాన్‌జౌవ్ కు చెందినటువంటి ఒక మహిళ ఫోక్స్ వాగన్ కారును కొనాలని చాలా కాలంగా డబ్బును దాస్తోంది.

10 సంవత్సరాలుగా అలా దాచిన చిల్లరనంతా తీసుకుని కారు షోరూంకు వచ్చి,కారును సెలెక్ట్ చేసుకుంది.ఆ తరువాత తన దగ్గరున్న 66 సంచుల చిల్లరను షాప్ వారికిచ్చింది. ఆ దెబ్బకి కారు షోరూం వారు తలలు పట్టుకున్నారు.ఆమె ఇచ్చిన చిల్లరను లెక్క పెట్టే సరికి షోరూం స్టాఫ్ చేతులు నల్లగా మారిపోయాయి.చిల్లరను లెక్కబెడుతూ అక్కడి స్టాఫ్ వీడియో తీసి,దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి