NewsWaves.news

సంబురాలు వ‌ద్దు.. మొక్క‌లు నాటండి: కార్య‌క‌ర్త‌ల‌తో కేటీఆర్‌

ఈ నెల 17న తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్‌రావు పుట్టిన రోజు జ‌రుపుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్త‌గా పార్టీ నేత‌లు, కార్య‌కర్త‌లు, అభిమానులు అయ‌న పుట్టి రోజున భారీ ఎత్తున సెల‌బ్రేట్ చేయ‌డానికి అరేంజ్‌మేంట్స్ చేస్తున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు సెల‌బ్రేష‌న్స్ పేరుతో డ‌బ్బు ఖ‌ర్చుపెట్టకుండా.. మొక్క‌లు నాటాల‌ని… ఆయ‌న ఆరోగ్యం బాగుండాల‌ని ప్రార్థించాల‌ని ఆ ట్వీట్‌లో తెలిపాడు కేటీఆర్‌.


అయితే మ‌రో వైపు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి తెరాస పార్టీ వ‌ర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో జ‌ల‌విహ‌ర్‌లో వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ట‌. ఒక ఫొటో ఎగ్జిబిష‌న్‌తో పాటు, చీర‌ల పంపిణి కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంద‌ట‌. ఈ కార్య‌క్ర‌మంలో కేటీఆర్‌, క‌విత‌, హ‌రీష్ రావు పాల్గొనున్నారు.

Related Articles