NewsWaves.news

ఏపీలో వైసీపీ గెలుస్తుంది : కేటీఆర్

మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఓటమి ఖాయమని టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపు తథ్యమని ఆయన స్పష్టం చేసారు. చంద్రబాబు దిల్లీలోనే కాదు, అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని కేటీఆర్ ఎద్దేవా చేసారు.

ఈ రోజు మీడియాతో మాట్లాడిన కేటీఆర్… ఐదేళ్లలో చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఢిల్లీని శాసించాలనే నినాదంతో పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్తామని, 16 పార్లమెంట్‌ స్థానాల్లో టీఆరెస్ విజయం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్‌ చెప్తున్నట్లు సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్‌ వర్సెస్‌ మోదీ వాతావరణం ఉండదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Related Articles