NewsWaves.news

నా నెంబ‌ర్ ఎందుకు బ్లాక్ చేశావు కేటీఆర్ : ఉత్త‌మ్

ప‌ద్మారావు గౌడ్ ను డిప్యూటీ స్పీకర్ గా ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డాని… ఇత‌ర పార్టీ నేత‌లను ఒప్పించేందుకు ప్ర‌స్తుతం తెరాసా నేతలు చ‌ర్చ‌లు జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. నిన్న మ‌జ్లిస్‌, భాజ‌పా పార్టీలు సూచ‌న ప్రాయంగా ఓకే చెప్పినా.. కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్ప‌ష్ట‌త రాలేదు. దీంతో రంగంలోకి దిగిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్ఎ కెటిఆర్ ఈరోజు సిఎల్పి నేత భట్టి విక్రమార్క, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.

ఉపసభాపతి ఎన్నికకు మద్దతివ్వాలని భట్టి, ఉత్తమ్ ను కెటిఆర్ కోరారు. ఇదే సమయంలో ఎంఎల్సీ ఎన్నికలపై కూడా చర్చ జరిగింది. తమకున్న ఎంఎల్ఎల సంఖ్యకు ఒక ఎంఎల్సీ స్థానం వస్తుందని కెటిఆర్ ను ఉత్తమ్ అడిగారు. తన ఫోన్ నంబర్ ఎందుకు బ్లాక్ చేశారని కెటిఆర్ ను ఉత్తమ్ సరదాగా అడిగారు. కెటిఆర్ బదులిస్తూ… తాను మెసేజ్ లు మాత్రమే చూస్తానని… మీ నంబర్ బ్లాక్ చేయలేదని బదులిచ్చారు. దీంతో ముగ్గురు మధ్య నవ్వులు విరబూశాయి.

Related Articles