NewsWaves.news

ఆ కారుపై మనసు పడ్డ కేటీఆర్…

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. రాజకీయాల గురించి అలాగే సినిమాల గురించి, తన ఇష్టాయిష్టాల గురించి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయనకు బాగా నచ్చేసిన ఒక కారు విషయం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.భారతదేశంలో జర్మన్ రాయబారిగా పనిచేస్తున్న వాల్టర్ జే లిండ్నర్ ఒక కారును ఉపయోగిస్తున్నారు.

ఆ కారు కేటీఆర్ కు బాగా నచ్చిందట. అయితే అంతగా నచ్చడానికి కారణం కూడా ఉందట.అది అంబాసిడర్ కారు. అంతేకాదు ఆ కారు కలర్ పింక్. దీంతో కేటీఆర్ ఆ కారు పై మనసు పారేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తు అలాగే ఆ పార్టీ రంగు కూడా కలిగిన అంబాసిడర్ కారును వాడుతుండటం కేటీఆర్ దృష్టిలో పడింది.దాంతో జర్మన్ అంబాసిడర్ వాడుతున్న అంబాసిడర్ కారు తనకు తెగ నచ్చిందని, దాని రంగు కూడా పింక్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి