NewsWaves.news

అమర జవాన్ల కుటుంబాలకు కేటీఆర్ సాయం

జమ్మూకాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్ల కుటుంబాలకు టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. సైనికుల సహాయ నిధికి తనవంతు సాయంగా 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు కేటీఆర్. ఈరోజు ఉదయం సీఆర్పీఎఫ్ దక్షిణ విభాగ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ అక్కడ జవాన్లకు నివాళులు అర్పించారు.

“అమరులైన సైనికుల గౌరవార్థం నా వంతు సాయంగా 25 లక్షల రూపాయలు, నా స్నేహితులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డొనేట్ చేసిన మరో 25 లక్షల రూపాయల చెక్కును జవాన్ల సహాయ నిధికి అందించాను” అని కేటీఆర్ తెలిపారు. పుల్వామాలో అమరులైన భారత జవాన్ల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ‘భారత్ కే వీర్’ వెబ్ సైట్ ద్వారా సినీ,రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా భారీగా విరాళాలు అందిస్తున్నారు.

Related Articles