NewsWaves.news

కేజీఎఫ్‌… బంగారం లాంటి సినిమా : కేటీఆర్‌

క‌న్న‌డ స్టార్ య‌ష్ హీరోగా విడుద‌లైన కేజీఎఫ్ చిత్రం ఎంతటి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. హీరో ఎలివేష‌న్ నుంచి, స్టోరీ, న్యారేష‌న్‌, స్క్రీన్‌ప్లే.. అన్నింటా బంగారం లాంటి సినిమా అనిపించుకుంది ఈ మూవీ. కేజీఎఫ్‌కు దేశ వ్యాప్తంగా ఎంతో మంది సెల‌బ్రిటీలు ఫిదా అయిపోయారు. అందులో తాజాగా సెల‌బ్రిటీ పొలిటీషియ‌న్, తెలంగాణ రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేరిపోయాడు. ఇటీవ‌లే ఈ సినిమాను చూసిన కేటీఆర్ .. మూవీని పొగుడుతూ ట్వీట్ చేశాడు.

కొద్దిగా ఆలస్యంగానైనా ‘కెజిఎఫ్’ మూవీ చూశా. వాట్ ఏ మూవీ. పట్టుసడలని స్క్రీన్ ప్లేతో దర్శకుడు ప్రశాంత్ నీల్ మ్యాజిక్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. టెక్నికల్ గా కూడా అద్భుతంగా ఉంది. రాక్ స్టార్ యష్ రప్ఫాడించాడు’ అంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

Related Articles