NewsWaves.news

కోహ్లీ పరుగుల యంత్రం: లారా

టీమిండియా సారథి విరాట్ కోహ్లీని దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా ప్రశంసించారు.విరాట్ కోహ్లీ మనిషి కాదని అతను యంత్రమని పరుగుల కోసం నిరంతరం తపిస్తూనే ఉంటాడని కొనియాడారు అతడి ఫిష్ ఫిట్ నెస్ అమోఘం అని ప్రశంసించాడు.ఎక్కువ క్రికెట్‌ ఆడాలంటే మరింత దృఢంగా ఉండాలి. కోహ్లీ ఎక్కువ సమయం జిమ్‌లో గడుపుతాడు. ఫిట్‌నెస్‌పై నిరంతరం పనిచేస్తాడు.

అందుకే అతడు పరుగుల యంత్రం’ అని లారా కొనియాడాడు. ఒక ఆటగాడు ఆడిన ప్రతిసారీ పరుగులు చేయడమంటే మామూలు విషయం కాదు .కోహ్లీలో ఓ ప్రత్యేక ప్రతిభ ఉంది. యువ క్రికెటర్లకు అతడో స్ఫూర్తి. సచిన్‌ వారసత్వాన్ని విరాట్‌ పుణికిపుచ్చుకున్నాడు.ఈ నెల 30 న ప్రపంచ కప్ ప్రారంభo కానుంది.ఇండియా ఖచ్చితంగా ప్రపంచ కప్ టోర్నీలో ఫేవరెట్ అని లారా అన్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి