NewsWaves.news

రాజస్థాన్ పై కోల్ కతా ఘన విజయం

ఐపీఎల్ 12 సీజన్ లో భాగంగా నిన్న జైపూర్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్కతా ఘనవిజయం సాధించింది. 140 పరుగుల విజయ లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే కోల్ కతా ముగించేసింది. 32 బంతుల్లో 50 పరుగులు చేసిన క్రిస్‌ లిన్‌, 25 బంతుల్లో 47 పరుగులు చేసిన సునీల్‌ నరైన్‌ లు కోల్ కతా విజయంలో కీలక పాత్ర పోషించారు.

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ అనే నిర్ణీత ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. 59 బంతుల్లో 73 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ రాజస్థాన్ స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు. నిన్నటి విజయంతో కోల్ కతా ఆడిన ఐదు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లు గెలిచినట్లయింది. ప్రస్తుతం ఐపీఎల్ 12 పాయింట్ల పట్టికలో కోల్కతా అగ్రస్థానంలో నిలిచింది.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి