NewsWaves.news

హోం శాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి…

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుండి ఎంపీగా విజయం సాధించిన బిజెపి సీనియర్ నేత కిషన్ రెడ్డి నిన్న కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కిషన్ రెడ్డి చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా తాజాగా ప్రధాని మోడీ తన క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు వివిధ శాఖలను కేటాయించారు. అందులో భాగంగా ముఖ్యమైన కేంద్ర హోంశాఖను బీజేపీ చీఫ్ అమిత్ షాకు కేటాయించిన విషయం తెలిసిందే.

అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డిని నియమించడం జరిగింది. తెలంగాణ బిజెపి నేత అయిన కిషన్ రెడ్డికి అమిత్ షా వర్గంలో ముఖ్యమైన పదవి దక్కింది. దీంతో మొట్టమొదటిసారిగా కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి స్వంతం చేసుకున్న కిషన్ రెడ్డి హోం శాఖకు సహాయ మంత్రిగా నియమింపబడడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి