NewsWaves.news

వైకాపాలో చేర‌నున్న‌ కేంద్ర మాజీ మంత్రి

వ‌రుస‌గా కొత్త నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వ‌ర‌లో మరో సీనియ‌ర్ నేత‌ను పార్టీలోకి ఆహ్వానించ‌నుంది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత‌ కిల్లి కృపారాణి …లోట‌స్ పాండ్‌లో ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌తో భేటీ అయిన ఆమె అనంత‌రం మీడియాతో మాట్లాడారు. అమ‌రావ‌తిలో ఈ నెల 28న జ‌రిగే కార్య‌క్ర‌మంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేర‌నున్న‌ట్టు తెలిపారు. జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని… దాని కోసం కృషి చేస్తామ‌న్నారు. ఇటీవ‌లే బీసీ గ‌ర్జ‌నలో జ‌గ‌న్ చేసిన ప్ర‌మాణాలు, హామీల‌ను పూర్తి చేస్తార‌ని న‌మ్ముతున్నాన‌న్నారు కిల్లి కృపారాణి.

బీసీల సంక్షేమ విష‌యంలో చంద్ర‌బాబు విఫ‌లం అయ్యార‌ని…జ‌గ‌న్ త‌ప్ప‌కుండా బీసీల అభివృద్ధికి ప‌నిచేస్తాడ‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. అదే స‌మ‌యంలో టికెట్ ఆశించి వైకాపాలో చేర‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Related Articles