NewsWaves.news

ఖుషి కపూర్ ఓపికకు అభిమానులు ఫిదా…

అతిలోక సుందరి శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో పెద్దమ్మాయి జాన్వీ కపూర్ ఆల్రెడీ ధఢక్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చేసి సూపర్ సక్సెస్ ను సాధించి ఇప్పుడు వరుస పెడుతున్న సినిమా ఆఫర్లతో బిజీ బిజీగా ఉంది.ఇక శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్. ఖుషి త్వరలోనే ఇండస్ట్రీలోకి రానుంది.ఇప్పటికే ఆమె మొదటి సినిమా గురించిన ప్లాన్స్ జరుగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన ఒక సంఘటనతో అభిమానులు ఖుషీ కి ఓపిక ఎక్కువ అని తెగ పొగిడేస్తున్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే ఖుషి తన అన్న అర్జున్ కపూర్ హీరోగా చేసిన మోస్ట్ వాంటెడ్ మూవీ ని చూడడానికి ఓ థియేటర్ కు వెళ్ళింది. ఇంకేముంది ఆమెను చూడగానే శ్రీదేవి అభిమానులు సెల్ఫీ దిగేందుకు ఆమెను చుట్టుముట్టారు. అయితే ఎంత మంది వచ్చి సెల్ఫీ అడుగుతున్నా అంతమందికి కూడా ఖుషి చాలా ఓపికగా సెల్ఫీ దిగే అవకాశం ఇచ్చింది. దీంతో వారంతా ఖుషి ఓపికకు ఫిదా అయ్యారు. అంతే కాదు స్టార్ హీరోయిన్ అయ్యేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఖుషికి పుష్కలంగా ఉన్నాయి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి