NewsWaves.news

ఖీర్ త‌యారు చేసే విధానం

ఇంటికి స‌డెన్ గా చుట్టాలొచ్చారు.. కానీ ఇంట్లో ఎక్కువ కిరాణా సామాన్లు లేవు…కానీ ఆతిథికి మ‌ర్యాద త‌గ్గ‌కూడ‌దు అనుకుంటే.. ఖీర్ ట్రై చేయండి. మీరు ఎన్నో సార్లు రుచి చూసిందే… చాలా ఈజీగా.. కొన్ని ప‌దార్ధాలతో మాత్ర‌మే త‌యారవుతుంది. పైగా రుచి సూప‌ర్‌గా ఉంటుంది. ఇంకెందుకు ఆల‌స్యం.. ఖీర్ చేయ‌డానికి కిచెన్‌లోకి ఎంట‌ర‌వ్వండి మ‌రి.

కావాల్సిన‌వి :

  • పాలు- అర‌లీట‌రు
  • ప‌చ్చికోవా- కొద్దిగా
  • పంచ‌దార‌- త‌గినంత‌
  • ఓట్స్ పిండి -రెండు టీ స్పూన్లు
  • నాన‌బెట్టి పొట్టు తీసి త‌రిగిన బాదాం -రెండు టీ స్పూన్లు
  • నాన‌బెట్టి స‌న్న‌గా తరిగిన జీడిప‌ప్పు- ఒక టీ స్పూన్‌

త‌యారు చేయాల్సిన విధానం :

  1. ఓట్స్ పిండిలో కొద్దిగా నీరు క‌లిపి కాగుతున్న పాల‌లో వేసి క‌లుపుకోవాలి.
    పాలు కాగుతున్న‌ప్పుడు ఆపి పంచార వేసి క‌రిగే వ‌ర‌కు కల‌పాలి.
  2. త‌రువాత దింపేసి చల్లారిన త‌రువాత యాల‌కుల పొడి, బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు వేసి క‌లిపి ఫ్రిజ్‌లో ఉంచి చ‌ల్ల‌గా అయిన త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇది పాల రుచిలో ఉంటుంది.

Related Articles