NewsWaves.news

మార్చి4 నుంచి కీస‌ర‌గుట్ట‌లో బ్ర‌హ్మోత్స‌వాలు

ప్ర‌తీ ఏడాది అంగ‌రంగ వైభంగా జ‌రిగే కీస‌రగుట్ట బ్రహ్మోత్స‌వాలు మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 4 నుంచి 7 వ తేదీ వ‌ర‌కు సాగే ఈ బ్ర‌హ్మోత్స‌వాలకు తెలంగాణ లోని వివిధ జిల్లాల నుంచి తండోప‌తండాలుగా భ‌క్తులు త‌ర‌లివ‌స్తారు.ఈ ర‌ద్దీని త‌ట్టుకునే విధంగా ఏర్పాట్లు చేయాల‌ని… ఉచిత వైద్య శిబిరాలు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.వి. రెడ్డి ఆదేశించారు.

తొక్కిస‌లాట జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని..ఆల‌యాన్ని విద్యుత్ దీపాల‌తో అలంక‌రించాల‌ని ఆదేశించారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

Related Articles