NewsWaves.news

క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం..కేసీఆర్‌

అనుకున్న సమయానికే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో సీఎం కేసీఆర్ మరో ముందడుగు వేశారు. పదిమంది కొత్త మంత్రులు కొలువు తీరారు. గవర్నర్ నరసింహన్ మంగళవారం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. శాసనసభ ఎన్నికల అనంతరం డిసెంబరు 13న సీఎం కేసీఆర్, మంత్రి మహమూద్అలీతో మంత్రివర్గం ఏర్పాటైంది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణకు రెండు నెలల సమయం పట్టింది.

మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రి ఎంతో కసరత్తు చేశారు. ఎటువంటి అసంతృప్తి, అసమ్మతులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజాసంబంధాలు, జిల్లాల ప్రాతినిధ్యాలు, సామాజిక సమీకరణలు, అనుభవం, రాబోయే లోక్సభ ఎన్నికలు ప్రాతిపదికగానే తుది జాబితాను రూపొందించారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం…ముఖ్య‌మంత్రి కేసీఆర్ భ‌విష్యత్తులో జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్ట‌నున్నార‌ట‌. అందుకే రాష్ట్ర స్థాయిలో టిఆర్ ఎస్ పార్టీ బాధ్య‌త‌లు కేటీర్‌కు అప్ప‌గించారు. త్వ‌ర‌లో కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిగా ప్ర‌క‌టించి పూర్తిగా ఢిల్లీ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్ట‌నున్నార‌ని స‌మాచారం. అందుకోస‌మే ప్ర‌స్తుతం కేటీఆర్‌కు మంత్రివ‌ర్గంలో చోటివ్వ‌లేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం కేటీఆర్ కూడా పార్టీ కార్య‌క‌లాపాల‌పై ఎక్కువ ఫోక‌స్ పెడుతోండ‌టం తెలిసిందే.

వచ్చే లోక్ సభ ఎన్నికలలో తెరాస మరింత బలమైన శక్తిగా రూపుదిద్దుకోవాలని కేసీఆర్ ఆకాంక్ష. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా సామాన్య కార్యకర్తగా, క్రమశిక్షణ గల నాయకుడిగా పనిచేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ మంత్రివర్గం విషయంలో చోటు దక్కలేదన్న అసంతృప్తి తనకు ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.

నిజానికి కేసీఆర్ వ్యూహం వేరట‌. పార్ల‌మెంట్‌లో తెలంగాణ స‌మ‌స్య‌లు, అభివృద్ధి గురించి గ‌ట్టిగా మాట్లాడే నేత ఒక‌రుంటే బాగుంటుంది అనుకున్నార‌ని..తదనుగుణంగానే హరీష్ రావుకు ప్రస్తుతం మంత్రి పదవి ఇవ్వకుండా లోక్ సభ ఎన్నికలలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. . ఇదే నిజ‌మైతే అటు కేసీఆర్‌, ఇటు హ‌రీష్ రావు జాతీయ రాజ‌కీయాల్లో పెనుమార్పున‌కు నాంది ప‌ల‌బోతున్న‌ర‌ని తెలుస్తోంది.

ఈ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన తోసిపుచ్చారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.రాజ్ భ‌వ‌న్‌లో మంగళవారం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధే ద్యేయంగా కొత్త మంత్రులు కేసీఆర్ మార్గదర్శకత్వంలో సమష్ఠిగా కృషి చేయాలని హరీష్ రావు సూచించారు.సూచించారు.

తెలంగాణలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గానికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్ట‌ర్ లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులను అభినందించారు. కొత్త మంత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి , ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డిలతో రాజ్ భ‌వ‌న్‌లో గవర్నర్ నరసింహన్.. ప్రమాణం చేయించారు.

Related Articles