NewsWaves.news

కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు..
తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తి రూపం, గ్రామీణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన మ‌హానాయ‌కుడు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌కు అహ‌ర‌హం శ్ర‌మించిన సైనికుడు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికే వ‌న్నె తెచ్చిన ఆద‌ర్శ నేత‌.


తెలంగాణ అభివృద్ధికి అలుపెరుగ‌క శ్ర‌మిస్తున్న నిత్య కృషీవ‌లుడు. ప్ర‌జా సంక్షేమం, అభ్యున్న‌తే కేసీఆర్ కు రెండు క‌ళ్ళు. కేసీఆర్ ఆలోచ‌న‌, ఆచ‌ర‌ణ ఎప్పుడూ ప్ర‌జ‌ల గురించే, ప్ర‌జా సంక్షేమంపైనే ఆయ‌న ధ్యాసంతా. అభిమానులంతా ఎంతో ఆప్యాయంగా, గుండెల నిండా ప్రేమ‌గా తెలంగాణ జాతిపితగా కీర్తిస్తున్నారంటే కేసీఆర్ గొప్ప‌త‌నానికి అంత‌క‌న్నా నిద‌ర్శ‌నం ఏం కావాలి.

65 వ‌సంతాలు పూర్తిచేసుకుని 66వ యేట అడుగిడుతున్న ప్ర‌జా బాంధ‌వుడు కేసీఆర్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని కోరుకుంటూ హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు అందచేస్తున్నారు న్యూస్ వేవ్స్

Related Articles