NewsWaves.news

కేసిఆర్ పుట్టినరోజు వేడుకలు రద్దు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో నిన్న జవాన్లపై జరిగిన ఉగ్రదాడి లో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ దాడి పట్ల తీవ్రంగా స్పందించిన కేసీఆర్ అమరులైన జవాన్ల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని ఆయన నిర్ణయించుకున్నారు. అంతేగాక తన పుట్టినరోజు వేడుకలు ఎవరూ నిర్వహించవద్దని పార్టీ శ్రేణులకు, అభిమానులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

Related Articles