NewsWaves.news

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించారు. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో టీఆరెస్ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. హోం మంత్రి మహమూద్ అలీకి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన కేసీఆర్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేశారు.

మరో ఎమ్మెల్సీ స్థానాన్ని మిత్రపక్షం ఎంఐఎంకు కేటాయించారు. ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఓసీకి ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానం చొప్పున కేటాయిస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేసింది టీఆరెస్ నాయకత్వం. మార్చి 12న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

Related Articles