NewsWaves.news

19న తెలంగాణ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌

ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న తెలంగాణ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 19న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేయ‌నున్న‌ట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎం గా ప్ర‌మాణం స్వీకారం చేసి ఇప్ప‌టికీ రెండు నెల‌లు అవుతోంది. 2018 డిసెంబర్ 13న ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. అనంత‌రం మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణపై క‌స‌ర‌త్తులు ప్రారంభించిన ముఖ్య‌మంత్రి ఒకేర‌క‌మైన శాఖ‌ల‌నున విలీనం చేస్తూ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేయాల‌ని క‌స‌ర‌త్తు చేశారు. ఇటీవ‌లే ఒకేర‌క‌మైన శాఖ‌ల విలీనం పూర్త‌యిన త‌రుణంలో 19వ తేదీని నిర్ణ‌యించారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మంత్రి వ‌ర్గ ఏర్పాటు జ‌ర‌గ‌నుంది.

Related Articles