NewsWaves.news

అమ‌రుల కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల సాయం

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ మొద‌లు కాగానే ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర రావు.. పుల్వామా దాడిలో అమ‌రులైన జ‌వాన్ల‌కు సంతాప తీర్మానం ప్ర‌వేశపెట్టారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారికి అండ‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు కేసీఆర్‌. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ముఖ్యమంత్రి…అమ‌రుడైన ప్ర‌తీ జవాను కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

∎ సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క మాట్టాడుతూ ఉగ్ర‌వాద చ‌ర్య‌ను ఖండించారు.
∎ అమ‌ర వీరుల‌కు ఎంఐఎం పార్టీ నేత‌లు నివాళుల‌ర్పించారు.

Related Articles