NewsWaves.news

మంత్రి మండలిలో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు స్థానం: కేసీఆర్

తెలంగాణ మంత్రి మండ‌లిలో మ‌హిళ‌ల‌కు కూడా చోటు ఇవ్వాల‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కేసీఆర్‌ను అడిగారు. దీనికి స్పందించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. స‌బితా ఇంద్రారెడ్డి గారు మీరేం చింత చేయవద్దు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇద్దరు మహిళా మంత్రులను కేబినేట్ లోకి తీసుకుంటాం. ఇంకా ఆరుగురికి అవకాశం ఉంది. ఆ ఆరుగురిలో ఇద్దరు మహిళా మంత్రులు ఉంటారు.

దయచేసి మీరు తప్పుడు ఆలోచనలు పెట్టుకోవద్దు. గత కేబినేట్ కూర్పులో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కాబట్టే మహిళలకు అవకాశం ఇవ్వలేకపోయాం. ఈ సారి ఖచ్చితంగా ఇద్దరు మహిళా మంత్రులను నియమిస్తాం. వారికి మంచి స్థానం కల్పిస్తాం.” అని అన్నారు. ఇప్పుడు ఆ ఇద్ద‌రు ఎవ‌ర‌నే విష‌యంపై చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.

Related Articles