NewsWaves.news

ఏపీలో అమల్లోకి వచ్చిన కాపు రిజర్వేషన్…

ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్ చట్టం అమలులోకి వచ్చింది.తాజాగా కేంద్రం ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ 10 శాతం రిజర్వేషన్లలో రాష్ట్రంలోని కాపులకు 5% ,అగ్రవర్ణ పేదలకు 5% కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో కాపులకు, అగ్రవర్ణ పేదలకు ఐదు శాతం చొప్పున రిజర్వేషన్ అమలులోకి తీసుకొచ్చినట్టు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.

ఈ రిజర్వేషన్ చట్టం వలన కాపులకు విద్యాసంస్థలు అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలలో ఐదు శాతం రిజర్వేషన్ లభించనుంది.ఇంతకాలం ఎటువంటి రిజర్వేషన్లు వర్తించనటువంటి బ్రాహ్మణులు, రెడ్డి, కమ్మ తదితర అగ్ర వర్ణాల వారికి కూడా విద్యాసంస్థలు అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇంకో ఉత్తర్వును కూడా జారీ చేయడం జరిగింది.

Related Articles