NewsWaves.news

మీ రైతు వ్యతిరేక వైఖరికి మరో రైతుని బలిచేశారు : క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఆంద్రప్ర‌దేశ్ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. రైతుల స‌భ అంటూ రైతు ప్రాణాలు తీసుకున్నార‌ని విమ‌ర్శించారు. కొండ‌వీడు ఉత్స‌వాల‌కు చంద్ర‌బాబు వ‌స్తున్నాడని టిడిపి కార్య‌కర్త‌లు, పోలీసులు కోట‌య్య అనే రైతు పొలాన్ని ఆక్ర‌మించార‌ని… ఆ దుర్మార్గాన్ని ప్ర‌శ్నిస్తే పోలీసులు లాఠీ దెబ్బ‌లు కొట్టార‌ని.. తీవ్రంగా గాయ‌ప‌డ్డ కోట‌య్య‌ను ఆసుప‌త్రికి కూడా తీసుకువెళ్ల‌నివ్వ‌లేద‌ని విమ‌ర్శించారు.

పోలీసుల లాఠీ దెబ్బ‌ల‌తో చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టు మిట్టాడుతున్న కోట‌య్య‌ను ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌డానికి అనుమ‌తించాల‌ని..ఆంబులెన్స్‌ను పిలిపించాల‌ని కోట‌య్య కొడుకు వేడుకున్న పోలీసులు విన‌లేదు. ముఖ్యమంత్రి సెక్యూరిటీ అని.. ప్రోటోకాల్ అని అన్నారు.. దీంతో భుజాల‌పై తీసుకెళ్తుండ‌గా.. మార్గ మ‌ధ్య‌లోనే కోట‌య్య మ‌ర‌ణించాడు.

Related Articles