NewsWaves.news

రాజ‌కీయం నేర్చుకో ర‌జినీ : క‌మల్ హాస‌న్ హిత‌వు

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌కు లోకనాయ‌కుడు క‌మల్‌హాస‌న్ హిత‌వు చెప్పాడు. ర‌జినీకాంత్‌ను రాజ‌కీయం నేర్చుకోమ‌ని స‌ల‌హానిచ్చాడు. నిజానికి క‌మ‌ల్- ర‌జినీ రాజకీయాల్లోకి స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే ఎంట‌ర్ అయ్యారు. కానీ ర‌జినీకాంత్ ఈ సారి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించాడు. ఇంత హైప్ చేసి ఇప్పుడు వెన‌క్కి త‌గ్గ‌డం ఏంటి అని ర‌జినీకాంత్‌- స్టాలిన్ ఇద్ద‌రికీ సెటైర్ వేశాడు క‌మల్‌. చెన్నైలో జ‌రిగిన ఒక స‌మావేశంలో మాట్లాడిన క‌మ‌ల్‌….వంటి నిండా నూనె పూసుకొని తొడ‌గొట్టిన మల్ల‌యోధుడు.. కుస్తీ చేయ‌కుండా రేపు వ‌స్తాన‌న‌డం.. ఇప్పుడు ర‌జ‌నీకాంత్‌, స్టాలిన్ వెన‌క్కి త‌గ్గ‌డం ఒక‌టేన‌న్నాడు. అయితే క‌మ‌ల్ కామెంట్స్‌తో ర‌జినీ ఫ్యాన్స్ బాగా హ‌ర్ట్ అయ్యార‌ట‌. మ‌రి ర‌జినీ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి మ‌రి.

Related Articles