NewsWaves.news

పాల్ గారూ !…వాటీజ్ దిస్..?

ఆంధ్రప్రదేశ్ లో  ఎన్నికల వేడి అంతకంతకూ పెరుగుతోంది. వలసల జోరు ఎక్కువైంది.  అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు  కేఏ పాల్  ఆసక్తి  కనబరుస్తున్నారు.  ఇటీవల విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్ మాట్లాడారు. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇంకా ఎవరికీ టికెట్లు ఇవ్వలేదని, ఎన్నికల సంఘం  తమ పార్టీకి  హెలికాప్టర్ గుర్తు  కేటాయించిందని చెప్పారు. కానీ, పాల్ అంతటితో ఆగలేదు.

 ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల సంఘం గుర్తు కేటాయిచిన  విషయాన్ని చెబుతూ  కేఏ పాల్ కొంత ఓవర్ యాక్షన్ చేశారు. మిగతా పార్టీల గుర్తులను తక్కువ చేసి మాట్లాడారు. “పగిలిపోయే గ్లాసు కాదు.. ఆగిపోయే ఫ్యాను కాదు.. డొక్కు సైకిల్ కాదు”..అంటూ  ఇతర పార్టీలను కించపరిచే ప్రయత్నం చేశారు. ఈ కామెంట్లపై టీడీపీ,వైకాపా సీరియస్ గా తీసుకోలేదుగానీ, జనసేన నేతలు ఒకింత ఆగ్రహం వెలిబుచ్చారు.

పాల్  తమ పార్టీ ఎన్నికల గుర్తు గురించి చెబుతుండగానే  గ్రహపాటో….  పొరపాటో… గానీ  పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో  ఆయన చెబుతున్న హెలికాప్టర్ కిందపడి ముక్కలైంది.

ఆత్మవిశ్వాసం మంచిదే, అవసరం కూడా…కానీ అత్యుత్సాహమే దెబ్బకొడుతుంది. 

Related Articles