NewsWaves.news

కోడి రామ‌కృష్ణ ఆరోగ్యం విష‌మం : ఆసుప‌త్రికి త‌ర‌లింపు

ప్ర‌ముఖ తెలుగు సినిమా ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ ఆరోగ్యం విష‌మంగా మారింది. దీంతో అసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు స‌మాచారం. ఒక్క సారిగా అనారోగ్యానికి గురైన ఆయ‌న్ను గ‌చ్చిబౌలిలోని ఎఐజీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించార‌ట‌. ఆయ‌న ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉంద‌ని… వెంటిలేట‌ర్‌పై ఉంచార‌ని తెలిసింది.

కొంత కాలం క్రిత‌మే కోడి రామ‌కృష్ణ‌కు హార్ట్ ఎటాక్, ప‌క్ష‌వాతం వ‌చ్చింది. చికిత్స త‌రువాత ఆయ‌న కోలుకున్నారు. అయితే మ‌ళ్లీ ఆయ‌న ఆరోగ్యం పాడవ‌డంతో ఇప్పుడు ఆసుప‌త్రికి త‌ర‌లించారు.ఆయ‌న ఆరోగ్యం మెరుగ‌వ్వాల‌ని అభిమానులు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. తెలుగు సినిమాకు ముద్దుల మేన‌ళ్లుడు, శతృవు, అమ్మోరు, అరుంధ‌తి వంటి ఎన్నో హిట్స్ ఇచ్చారు కోడి రామ‌కృష్ణ‌.

Related Articles