NewsWaves.news

మనసెప్పుడూ భారంగానే ఉంటుంది… జాన్వీ కపూర్

అందాల తార,సినీనటి శ్రీదేవి మరణించి సంవత్సరం అవుతుంది. అభిమానులు ఇంతకాలమైనా కూడా శ్రీదేవిని మర్చిపోలేకపోతున్నారు. ఇక శ్రీదేవి కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలతోనే గడుపుతున్నారు ముఖ్యంగా శ్రీదేవి కూతురు జాన్వి ప్రతి సందర్భంలోనూ తల్లిని గుర్తుచేసుకుంటూ ఉంటుందనే విషయం తెలిసిందే.

శ్రీదేవి వారసురాలిగా సినీ రంగానికి పరిచయమైన జాన్వి ఆదివారం రోజు శ్రీదేవి తొలి వర్ధంతి సందర్భంగా తన తల్లితో ఉన్న జ్ఞాపకాలని మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన ఇంస్టాగ్రామ్ లో… జాన్వి చేతిని శ్రీదేవి పట్టుకొని ఉన్న తన చిన్ననాటి ఫోటో ఒకటి షేర్ చేయడం తో పాటు ఒక పోస్ట్ కూడా చేసింది జాన్వి. “నా మనసు ఎప్పుడు భారంగానే ఉంటుంది.అంత బాధలో కూడా నేను నవ్వుతూనే ఉంటాను. ఎందుకంటే ఆ నవ్వులోనే నువ్వున్నావు”.. అంటూ ఎమోషనల్ గా జాన్వి పోస్ట్ చేసింది.

Related Articles