NewsWaves.news

ఉత్తర ప్రదేశ్ లో జైషే ఉగ్రవాదుల అరెస్ట్

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉగ్రవాదుల కదలికలు సంచలనం రేపుతున్నాయి. సహరన్‌పూర్‌ జిల్లా దేవబంద్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను అరెస్టు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ డీజీపీ ఓపీ సింగ్‌ తెలిపారు. రాష్ట్రంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో యూపీ యాంటీ టెరరిస్ట్‌ స్క్వాడ్‌ విస్తృత తనిఖీ చేపట్టి ఇద్దరు తీవ్రవాదులకు అరెస్టు చేసింది.

ఈ తనిఖీల్లో జైషే ఉగ్రవాద సంస్థంతో సంబంధమున్న షానావాజ్‌ అహ్మద్‌ తెలి, అఖిబ్‌ అహ్మద్ మాలిక్‌లను నిన్న అరెస్టు చేసినట్లు యూపీ డీజీపీ ప్రకటించారు. అరెస్టయిన ఇద్దరు ఉగ్రవాదులు కశ్మీర్‌కు చెందినవారే. షానావాజ్‌ స్వస్థలం కుల్గాం, మాలిక్‌ స్వస్థలం పుల్వామాగా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి రెండు ఆయుధాలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ ఓపీ సింగ్‌ తెలిపారు.

Related Articles