NewsWaves.news

జయరాం హత్య కేసులో బయటపడుతున్న సంచలన నిజాలు…

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు బయట పడుతున్నాయి. ఇంతకు ముందు వరకు..తన దగ్గర తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వకపోవడం వల్లే ఇంటికి పిలిపించి, దాడి చేయడం జరిగిందని, ఆ సందర్భంలోనే జయరాం మృతిచెందాడని చెప్పాడు రాకేష్ రెడ్డి. అయితే ఇప్పుడు రాకేష్ రెడ్డిని విచారిస్తున్న పోలీసులకు కొత్త నిజాలు బయట పడుతున్నట్టుగా సమాచారం.

జయరాం తనకి ఒక్క రూపాయి కూడా అప్పుగా ఇవ్వలేదని,జయరాం ని బెదిరించి,డబ్బులు వసూలు చేయాలనే ప్లాన్ తోనే ఇంటికి పిలిపించినట్టు రాకేష్ తెలిపినట్టు సమాచారం.జయరాం మరణించిన తర్వాత హైదరాబాద్ కి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరిని రంగంలోకి దింపాడు. తర్వాత తనకు అప్పు ఇచ్చినట్లుగా సాక్ష్యాలను సృష్టించాడు రాకేష్.

ఈ కేసులో టాస్క్ఫోర్స్ పోలీసులు చింతల్ కి చెందిన మరో రౌడీషీటర్ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ కేసులో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల సహకారం కూడా ఉందని, మొత్తం ఏడుగురు వ్యక్తులను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Related Articles