NewsWaves.news

మ‌ళ్లీ నోరు పారేసుకున్న పాక్ క్రికెట‌ర్‌

ఎప్పుడూ ఏదో విష‌యంలో నోరు పారేసుకునే పాకిస్తానీ కుప్పిగంతుల‌ క్రికెట‌ర్ జావేద్ మియాందాద్, భార‌త్‌పై మ‌ళ్లీ వివాదాస్ప‌ద కామెంట్స్ చేశాడు. పుల్వామా దాడి త‌ర్వాత పాకిస్తాన్‌పై భార‌త ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డుతూ నోరు పారేసుకున్నాడు ఈ మాజీ క్రికెట‌ర్‌.

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ – పాకిస్తాన్ మ్యాచ్ విష‌యంలో ఇప్పుడు వివాదం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే దీనిపై మియాందాద్ స్పందిస్తూ… ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో పాకిస్తాన్ కు లింక్స్ ఉన్నాయ‌నే సాకుతో… పాకిస్తాన్‌ను ప్ర‌పంచ‌క‌ప్ నుంచి దూరం చేయ‌డానికి భార‌త్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని… ఇది ఒక ప‌నికిమాలిన చ‌ర్య అన్నాడు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణ‌యాల‌ను ఐసిసి ఎందుకు ఒప్పుకుంటుంద‌ని..ఆ అవ‌స‌రం లేద‌న్నాడు జావేద్.

Related Articles