NewsWaves.news

4న తిరుప‌తిలో జ‌న‌సేన బ‌హిరంగ స‌భ‌

తిరుప‌తి న‌గ‌రంలో ఈనెల 4వ తేదీన జనసేన, బీఎస్పీ అధినేతల బహిరంగ సభ జరగనుంది. తిరుపతిలోని తారకరామా మైదానంలో జరుగనున్న సభకు బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, ప‌లువురు సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు.

మధ్యాహ్నం 3గంటలకు తిరుపతిలో బహిరంగ సభ నిర్వ‌హిస్తారు. అనంతరం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సభకు వారు వెళ్తారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.జే మల్లికల్‌, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ తదితరులు బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను పరిశీలించారు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి