NewsWaves.news

పాకిస్తాన్ ను ఏకాకిని చేస్తాం : అరుణ్ జైట్లీ

ప్రపంచ వేదికపై పాకిస్థాన్ ను ఏకాకిని చేస్తామని భారత ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. నిన్న కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో అరుణ్ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని జైట్లీ ఆరోపించారు. అందుకే పాకిస్థాన్ ను ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ జాబితా నుండి తొలగించాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. భారత్ ను రెచ్చగొడుతున్న పాకిస్థాన్ భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని అరుణ్ జైట్లీ పాక్ ను హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన జైట్లీ, ఇదొక పిరికిపందల చర్య అని అన్నారు.

Related Articles