NewsWaves.news

తెరాస‌లోకి జ‌గ్గారెడ్డి ?

తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హ‌రీష్ రావు చిక్కులు ఎదుర్కోనున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. బ‌య‌టి ప్ర‌పంచం ముందు బాగానే ఉన్నా.. కేటీఆర్- హ‌రీష్ రావుకు మ‌ధ్య విభేధాలు ఉన్న మాట వినిపిస్తోంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ఇప్పుడు కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి టీఆర్ ఎస్‌లోకి ఎంట‌ర్ అవ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. టైమ్ దొరికితే చాలు టీఆర్ ఎస్ ను, హ‌రీష్ రావును విమ‌ర్శించే జ‌గ్గారెడ్డి తెరాసాలో చేర‌డం ఏంట‌ని అనుకుంటున్నారు కూడా. దీనికి కార‌ణం ఈ మ‌ధ్య జ‌గ్గారెడ్డి కేటీఆర్‌ను పొగుడుతున్నారు.. హ‌రీష్ రావును విమ‌ర్శిస్తున్నారు.

హ‌రీష్ రావు వేరేలా ఆలోచిస్తున్నార‌ని.. దీంతో కేటీర్‌కు ఇబ్బంది త‌ప్ప‌ద‌ని రీసెంట్‌గా జ‌గ్గారెడ్డి కామెంట్ చేశాడు. దీంతో ఒక్క సారిగా టిఆర్ఎస్ లో కలకలం రేగింది. స‌డెన్ గా కేటీఆర్‌పై జ‌గ్గారెడ్డికి అభిమానం పుట్ట‌డానికి ఏమైనా వేరే కార‌ణాలు ఉన్నాయా…కేసులు గ‌ట్రా నుంచి త‌ప్పించుకోవ‌డానికి తెరాసాలో చేర‌బోతున్నాడా ఇలా ఎన్నో సందేహాలు, ఊహ‌గానాల మ‌ధ్య ఖ‌చ్చితంగా ఏం జ‌ర‌గ‌నుందో అధికారికంగా ఒక ప్ర‌క‌ట‌న వ‌స్తేగానీ తెలియ‌దు. కానీ పార్టీ మార‌నున్న‌ట్టు వార్త‌లు మాత్రం ఊపందుకున్నాయి.

Related Articles