NewsWaves.news

27న జ‌గ‌న్ గృహప్ర‌వేశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌తిప‌క్ష నేత, వైకాపా అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు తాడేప‌ల్లిలో నిర్మించిన కొత్త ఇంటిలోకి 27న‌ గృహ ప్రవేశం చేయనున్నారు. ఈ కొత్త ఇల్లు హైద‌రాబాద్‌లో ఉన్న లోట‌స్ పాండ్ కంటే బాగుంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. గృహ‌ప్ర‌వేశం త‌రువాత కొత్తగా ఏర్పాటు చేయ‌నున్న పార్టీ కార్యాల‌యాన్ని కూడా ప్రారంభించ‌నున్నార‌ట‌.

ఈ కార్య‌క్ర‌మంల‌తో పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర నేత‌లు, సెల‌బ్రిటీలు పాల్గోనున్నార‌ట‌.

Related Articles