NewsWaves.news

బీసీలపై జగన్ వరాల జల్లు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బీసీలపై వరాల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే బీసీల అభివృద్ధికి ప్రతి సంవత్సరం 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరిధిలోని అన్ని కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, ఇతర నామినేషన్ పోస్టులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 % స్థానం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు.

కార్పొరేషన్ల వ్యవస్థను బలోపేతం చేస్తామని, అన్ని సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు. బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదని వారు జాతికి వెన్నుముక అని ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీసీ గర్జనలో జగన్ సహా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, వైఎస్ఆర్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారథి, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles