NewsWaves.news

బాబును జైలుకు పంపిస్తా : జ‌గ‌న్‌

వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చంద్ర‌బాబు గురించి కీల‌క వ్యాఖ్యాలు చేశారు. ఇటీలే ప్ర‌ముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ తో ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు జ‌గ‌న్‌. ఈ సంద‌ర్భంలో రాజ్‌దీప్ ఒక ప్ర‌శ్న అడిగాడు.. మీరు అధికారంలోకి వ‌స్తే.. చంద్ర‌బాబుపై ఎన్‌క్వైరీ చేయిస్తారా అని అడిగాడు. దానికి స‌మాధానంగా.. త‌ప్పు చేసిన ప్ర‌తీ నేర‌స్తుడిని జైలుకు పంపిస్తాం అన్నాడు.

రాజ‌కీయ పార్టీలు అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌పై ఉన్న కేసుల‌ను రీ ఓపెన్ చేసి వాళ్ల‌ను జైలు బాట ప‌ట్టిండం చాలా కామ‌న్‌. ఇప్పుడు జ‌గ‌న్ ఏపీలో అధికారంలోకి వ‌స్తే… చంద్ర‌బాబు విష‌యంలో అదే రిపీట్ చేయ‌నున్నాడేమో.

చంద్ర‌బాబు హైద‌రాబాద్‌ను నిర్మించిన‌ట్టే.. అమ‌రావ‌తిని నిర్మిస్తానంటున్నాడు.. మీరేం అంటారు అని రాజ్‌దీప్ మ‌రో ప్ర‌శ్న అడిగాడు.. దీనికి స‌మాధానంగా చంద్ర‌బాబు.. అప్పుడూ హైద‌రాబాద్‌ను నిర్మించ‌లేదు..ఇప్పుడు అమ‌రావ‌తినీ నిర్మించ‌డం లేదు అన్నాడు. చంద్ర‌బాబు క‌న్నా వైఎస్సారే హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేశాడ‌న్నాడు.

Related Articles

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి