NewsWaves.news

బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌గ‌దీష్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి

తెలంగాణ మంత్రులు ఇటీవ‌లే ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ముఖ్య‌మంత్రి కేసీఆర్ వారికి వివిధ శాఖ‌లు కూడా కేటాయించ‌డంతో మంత్రులు ఒక్క‌క్క‌రిగా మంచి టైమ్ చూసుకొని బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా గుంట‌కండ్ల జ‌గ‌దీష్ రెడ్డి, వ్య‌వ‌సాయ శాఖ మంత్రిగా నిరంజ‌న్ రెడ్డి ఈరోజు బాధ్య‌తలు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జాప్ర‌తినిధులు, సెక్ర‌టేరియ‌న్ ఉద్యోగులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన జ‌గ‌దీష్ రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ.. త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తానన్నారు.

Related Articles